Natyam ad

డ్రైవర్ తో లేచిపోయిన కూతురు..

లెటర్‌ రాసి కుటుంబ సభ్యులు ఆత్మహత్య

బెంగళూరు ముచ్చట్లు:

Post Midle

కన్న కూతురు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి సంబంధం వస్తే పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తున్న తండ్రి ఆయన కూతురిని ఎంబీఏ చదివించాడు. ఎంబీఏ పూర్తి చేసిన యువతి డ్రైవర్ తో లవ్ లో పడింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు కూతురిని మందలించారు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో.. ఆయువతి ప్రియుడితో లేచిపోయింది. తక్కువ కులం వాడితో కూతురు లేచిపోయిందని ఆవేదనతో ఆమె తల్లిదండ్రులు వాట్సాప్ లో ఇంటికి రావాలని, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని మెసేజ్ పంపించాడు. అయితే ఆ యువతి మాత్రం స్పందించలేదు. కూతురు లేచిపోవడం భరించలేని ఆకుటుంబం పండుగ రోజు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తల్లిదండ్రులు, సోదరుడు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు ఎవరు అనేది కారణంతో సహా డెత్‌ నోట్ లో రాసిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లాలోని శిడ్లఘట్ట తాలుకాలోని హండిగనాళ గ్రామంలో చోటుచేసుకుంది.హండిగనాళ గ్రామంలో శ్రీరామప్ప, సరోజమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీరామప్ప, సరోజమ్మ దంపతులకు అర్చనా అనే కుమార్తె, మనోజ్ అనే కుమారుడు ఉన్నారు. అర్చనా బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, మంచి సంబంధం వస్తే పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

 

 

 

వ్యవసాయం చేస్తున్న శ్రీరామప్ప ఆయన కూతురు అర్చనాను ఎంబీఏ చదివించాడు. ఎంబీఏ పూర్తి చేసిన అర్చనా ఆమె నివాసం ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న డ్రైవర్ నారాయణస్వామితో ప్రేమలో పడింది. చాలాకాలం పాటు అర్చనా, నారాయణస్వామి ప్రేమ వ్యవహారం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అర్చనా కంటే నారాయణస్వామి కులంలో తక్కువవాడు. కులంతో పాటు ఆస్తి అంతస్తులో నారాయణస్వామి తక్కువ వాడు అని తెలిసినా అర్చనా అతని వెంటతిరిగింది. అర్చనా ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ఆమె తండ్రి శ్రీరామప్ప, ఆయన బంధువులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.పెళ్లి సంబంధాలు రావడంతో అర్చనా ఆమె ప్రియుడ నారాయణస్వామితో వెల్లిపోయింది. తక్కువ కులం వాడు అయిన నారాయణస్వామితో కూతురు అర్చనా లేచిపోయిందని ఆవేదనతో ఆమె తల్లిదండ్రులు శ్రీరామప్ప, సరోజమ్మ దంపతులు కొన్ని రోజుల ఇంటి నుంచి బయటకు రావడం మానేశారు. అర్చనాకు ఆమె సోదరుడు మనోజ్ ఇంటికి రావాలని, లేదంటే మేము అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటామని వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు.

 

 

 

అయితే అర్చనా మాత్రం స్పందించలేదు. తన కన్నకూతురు అర్చనా మా పరువు తీసిందని ఆమె తల్లిదండ్రులు శ్రీరామప్ప, సరజోమ్మతో పాటు సోదరుడు మనోజ్ దసరా పండుగ రోజు ఒకేసారి విషంతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈవిషం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ప్రియుడితో వున్న అర్చనా మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. కుటుంబ సభ్యుల అంత్యక్రియులకు వస్తుందో లేదా అని ఆమె బంధువులు అర్చన కోసం వేసి చూస్తున్నారు. ప్రేమ వ్యవహారంతో కుటుంబ సభ్యులను దూరం చేసుకున్న అర్చన అంత్యక్రియలకైనా వస్తుందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

 

Tags: The daughter who woke up with the driver..

Post Midle