గాంధీ భవన్ లో డీసీసీ అధ్యక్షులు భేటీ

Date:11/02/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
గాంధీ భవన్ లో సోమవారం డీసీసీ అధ్యక్షులు భేటీ జరిగింది. ఈ  కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు లు కుసుమ కుమార్, ఎమ్యెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్యెల్యే లు ఆత్రం సక్కు, రోహిత్ రెడ్డి, అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు హజరయ్యారు.  కుంతియా మాట్లాడుతూ 15వ తేదీలోగా డీసీసీ కమిటీ లు ఏర్పాటు చేసుకోవాలి. 21 మంది కంటే కమిటీ లో ఎక్కువ ఉండకూడదని సూచించారు. బ్లాక్ కమిటీ, మండల్ కమిటీ, బూత్ లెవెల్ కమిటీ వెంటనే ఏర్పాటు చేసుకోవాలి.. బూత్ లెవెల్ ఏజెంట్ నియామకం చాలా ముఖ్యం. జిల్లాలో ఉన్న రాష్ట్ర కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు ప్రత్యేక ఆహ్వానితులేనని స్పష్టం చేసారు. వెంటనే బ్లాక్ లెవెల్ ఏజెంట్ల నియామకం జరపాలి. కొత్త జిల్లాలలో పార్టీ కార్యాలయాలు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Tags:The DCC Presidents meet in Gandhi Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *