జర్నలిస్టు చారి మరణం తీరని లోటు

రాజమహేంద్రవరం ముచ్చట్లు:

సీనియర్ జర్నలిస్టు చారి మృతి జర్నలిజం రంగానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా తీరనిలోటని రాజమహేంద్రవరం ఎంపి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు.  రాజమహేంద్రవరం నగరంలోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపి కార్యాలయంలో  ముందుగా స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ విగ్రహానికి పూల మాలలువేసి, అనంతరం చారి చిత్ర పటానికి ఎంపి భరత్ పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో జర్నలిస్టు చారి తో ఆయనకున్న సాన్నిహిత్యం గుర్తుచేసుకున్నారు.  ఈ సందర్భంగా చారి  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎంపి భరత్ రామ్ తెలియజేశారు.  ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్ధిక సహాయాన్ని ఈ సందర్భంగా చారి కుటుంబ సభ్యులకు ఎంపి భరత్ రామ్ అందజేశారు.  తన వంతు సహాయాన్ని కూడా త్వరలో అందజేస్తానని ఎంపి తెలిపారు. కార్యక్రమంలో ఎపియు డబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి మండేలా శ్రీ రామ మూర్తి, పార్లమెంటరీ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:The death of a journalist is a desperate loss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *