Date:11/01/2021
న్యూఢిల్లీ ముచ్చట్లు:
భారతదేశం యొక్క రెండవ ప్రధానమంత్రిగా సేవలందించింన లాల్ బహదూర్ శాస్త్రి.. 1966 లో ఇదే రోజున ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్లో కన్నుమూశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత 1964 జూన్ 9 న శాస్త్రి ప్రధాని అయ్యారు. ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఊపిరిగా దేశాభివృద్ధిలో కీలకంగా పనిచేశారు. సుమారు 18 నెలలపాటు ప్రధానిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే 1965 యుద్ధంలో భారత్ పాకిస్తాన్‌ను ఓడించింది. ఆ తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై సంతకం చేయడానికి తాష్కెంట్‌కు వెళ్లి అక్కడే తుదిశ్వాస విడిచారు.
అయితే, లాల్ బహదూర్ శాస్త్రి మరణం నేటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది. మరణానికి అరగంట ముందు శాస్త్రి బాగానే ఉన్నారని, అయితే 15 నుంచి 20 నిమిషాల్లో ఆయన ఆరోగ్యం క్షీణించిందని చెప్తారు. వైద్యులు అతనికి అంతర్-కండరాల ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే అతను మరణించినట్లు చరిత్ర చెప్తున్నది. విషం ఇచ్చి చంపారని ఆయన భార్య లలితా శాస్త్రి ఆరోపించింది. తన తండ్రి శరీరంలో నీలి రంగు గుర్తులు కనిపించాయని కుమారుడు సునీల్ శాస్త్రి కూడా చెప్పడం విశేషం. తాష్కెంట్ విమానాశ్రయంలో శాస్త్రి శవపేటిక దగ్గరకు వచ్చి నాటి సోవియట్ ప్రధాన మంత్రి అలెక్సీ కోసిగిన్, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ నివాళులర్పించారు.
మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన కమిషనర్ కెఎల్.వర్మ
Tags: The death of Lal Bahadur Shastri is still a mystery