మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి రాష్ట్ర ప్రజలకు తీరని లోటు

వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి
 
తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం వై ఎస్ ఆర్ సి పీ పార్టీకి రాష్ట్ర ప్రజలకు తీరని లోటని వైఎస్ఆర్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి తెలిపారు. వై ఎస్ ఆర్ టీ యూ సి అనుబంధ నేషనల్ ఆకాడమీ ఆప్ కన్స్ట్రక్షను సంస్థ వైస్ ఛైర్మన్ గా ఉన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర అధ్యక్షులు డా. పునూరు గౌతమ్ రెడ్డి అదేశాల మేరకు వై ఎస్ ఆర్ టీ యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాక్ ఎంప్లా యిస్ యూనియన్ రాష్ట్ర గౌరవా ధ్యక్షులు ఎన్. రాజారెడ్డి అడ్వర్యంలో న్యాక్ రిజిస్ట్రేసన్ చేయాలని మరియు ప్రతి నెల ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేటట్లు చూడాలని మంత్రిని కలిసి కోరగా అప్పటి కప్పుడే సం బంధిత అధికారులకు పోన్ చేసి వెంటనే జీతాలు పడేటట్లు చేశారు. న్యాక్ రిజిస్ట్రేసన్ కూడ సంతకం చేసి ముఖ్యమంత్రి కార్యాలయనికి పంపడం జరిగింది. అటువంటి యువ మంత్రి మనకు దూరం కావడం బాధాకరం. దుబాయ్ లో జరిగిన పరిశ్రామిక ఎక్స్ పో కు వెళ్లి చాల పరిశ్రమల తో ఒప్పందం కుదుర్చు కొని వాటి ద్వారా రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించక ముందే చనిపోవడం బాధా కరమని తెలిపారు.
 
Tags: The death of Minister Mekapati Gautam Reddy is a great loss to the party and the people of the state

Leave A Reply

Your email address will not be published.