Natyam ad

సీనియర్ జర్నలిస్టు మబ్బు గోపాల్ రెడ్డి మృతి బాధాకరం

– కుటుంబ సభ్యులను పరామర్శించిన టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు   మబ్బు గోపాల్ రెడ్డి మరణం బాధాకరమని టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు . గురువారం ఉదయం ఆయన గోపాల్ రెడ్డి కుమారుడు   రాజశేఖరరెడ్డి ని ఫోన్ లో పరామర్శించారు . గోపాల్ రెడ్డి 40 సంవత్సరాలుగా జర్నలిస్టుగా విశేష సేవలు అందించారని కొనియాడారు . 77 సంవత్సరాల వయసులో కూడా విధి నిర్వహణలోనే తనువు చాలించారని అన్నారు . నేటి తరం జర్నలిస్టులకు  గోపాల్ రెడ్డి ఆదర్శనీయుడన్నారు . టీటీడీ తరపున  గోపాల్ రెడ్డి కుటుంబానికి తగిన సహకారం అందిస్తామని  సుబ్బారెడ్డి తెలిపారు . వేంకటేశ్వర స్వామి వారు  గోపాల్ రెడ్డి ఆత్మకు శాంతి కలిగించాలని చైర్మన్ ప్రార్థించారు .టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి పరామర్శసీనియర్ జర్నలిస్టు   మబ్బు గోపాల్ రెడ్డి మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని టీటీడీ ఈవో  ఎ వి ధర్మారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.గురువారం ఉదయం ఆయన  గోపాల్ రెడ్డి కుమారుడు  రాజశేఖర్ రెడ్డి ని ఫోన్ లో పరామర్శించారు . బ్రహ్మోత్సవ కంకణం కట్టుకున్నందువల్ల నేరుగా రాలేక పోతున్నానని ఆయన చెప్పారు .  గోపాల్ రెడ్డి వ్యక్తి గతంగా తనకు మిత్రుడని అన్నారు .విలువలతో కూడిన ఓ మంచి జర్నలిస్టును కోల్పోయామని చెప్పారు .  గోపాల్ రెడ్డి ఆత్మకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు శాంతి ప్రసాదించాలని ఈవో ప్రార్థించారు .

 

Tags:The death of senior journalist Mabu Gopal Reddy is sad

Post Midle

Leave A Reply

Your email address will not be published.