– మంత్రి పెద్దిరెడ్డి సంతాపం
Date:08/11/2019
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ సమీపంలోని గూడూరుపల్లె శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ధర్మకర్త కొండవీటి నాగరాజ (65 ) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో భాదపడుతూ మృతి చెందారు. ఈయన మృతి వార్త తెలియగానే రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా సంతాపం తెలిపారు. ప్రస్తుతం సుమారు రూ.2 కోట్లతో లక్ష్మీనరసింహాస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చురుగ్గా నిర్వహిస్తుండగా అర్ధాంతరంగా నాగరాజ మృతి చెందడం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతి వార్తతో ఆయన సోదరులు కొండవీటి నాగముని, కొండవీటి నాగేంద్ర, కొండవీటి నాగభూషణం , కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.పట్టణ ప్రజలు పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు.
నల్లగుట్లపల్లెలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీశిబిరం
Tags: The death of the temple trustee Kondaviti Nagaraja