-గురుకులం నిర్లక్ష్యమే
– జ్వరంతో ఉన్న పట్టించుకోని వైనం
-బాలిక రాసిన లేఖను సైతం మార్చిన ఉద్యోగులు
– విషాదంలో కుటుంబం
-రహస్యంగా దాచిన సంఘటన
పుంగనూరు ముచ్చట్లు:
ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 7వ తరగతి చదువుతున్న విద్యార్థి డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ చికిత్సలు చేయించకపోవడంతో ఇంటికి వెళ్లేందుకు అనుమతి కోరి , ఆసుపత్రిలో చికిత్సలు చేసుకుంటు సోమవారం మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని మేలుపట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమల మండలం ఈర్లపల్లికి చెందిన వెంకట్రమణ, ఈశ్వరమ్మ దంపతుల కుమారై పూర్ణిమ్మ( 12) 7వ తరగతి చదువుతోంది. ఇలా ఉండగా పూర్ణిమకు తీవ్రమైన జ్వరం సోకడంతో ఇబ్బందులకు గురైంది. ప్రిన్సిపాల్, సిబ్బంది వైద్యసేవలు అందించకపోవడంతో ఇంటికి వెళ్లి చికిత్సలు చేసుకుని రెండు రోజుల్లో వస్తానని ప్రిన్సిపాల్‌కు గత నెల 27న పూర్ణిమ లీవ్‌లెటర్ రాసి అనుమతి పొందింది. ఈ మేరకు తన చినాన్న బాబుతో అదే రోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు వెంటనే బాలికను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. పరిస్థితి విషమంగా ఉందని డెంగ్యూ జ్వరంతో రక్తప్రసరణ తగ్గిందని, తక్షణమే తిరుపతికి వెళ్లాలని డాక్టర్లు సూచించడంతో బాలికను తీసుకుని తిరుపతికి వెళ్తుండగా మార్గ మధ్యంలో పూర్ణిమ మృతి చెందింది. బాలిక మృతితో ఆకుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసి హాస్టల్‌లో విద్యార్థినీలు భయాందోళనలకు గురౌతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
లేఖ మార్చారు…
పూర్ణిమ తనకు ఆరోగ్యం సరిగా లేదని , ఇంటికి వెళ్లి రెండు రోజుల్లో తిరిగి వస్తానని ప్రిన్సిపాల్‌కు లేఖ రాసి వెళ్లింది. కానీ నిర్లక్ష్యం చేసి బాలికకు చికిత్సలు చేయకపోవడం , ఆబాలిక డెంగ్యూ భారీన పడి మృతి చెందడంతో ప్రిన్సిపాల్‌తో సహా సిబ్బంది నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు బాలిక రాసిన లేఖను మార్చారు. పూర్ణిమకు ఆరోగ్యం సరిగా లేదని రాయగా, మధ్యలో మై మదర్‌సిక్ అని చేర్పించారు.
అందరు ఉన్న ఫలితం లేదు…
గిరిజన గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ మేరిమార్గరేట్ తో సహా నర్సు, వార్డెన్, ఉపాధ్యాయులు ఉన్న పూర్ణిమను గమనించక ఎలాంటి వైద్యసేవలు అందించక నిర్లక్ష్యం చేయడంతో ఆబాలిక మృతి చెందినట్లు స్పష్టమౌతోంది. జ్వరంతో బాధపడుతున్న బాలికకు వైద్యం అందించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను విచారించగా సరైన సమాధానాలు ఇవ్వలేదు. తల్లికి బాగలేదని ఇంటికి పూర్ణిమ వెళ్లిందని , బాలిక మృతి చెందిన విషయం ఈరోజే తెలిసిందని సమాధానం దాటా వేశారు. లీవ్ లేటర్‌ను మార్చిందెవరని అడగగా సమాధానం చెప్పలేదు.
Tags: The deceased student said he would return to school in two days