టిటిడి పాలకమండలి నిర్ణయం సరికాదు: స్వరూపానందేంద్ర సరస్వతి

The decision of TTD Governing Council is not correct: Swaroopanandra Saraswathi

The decision of TTD Governing Council is not correct: Swaroopanandra Saraswathi

Date:17/07/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
తిరుమలలో మహా సంప్రోక్షణ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులను పూర్తిగా అనుమతించరాదన్న తితిదే పాలకమండలి నిర్ణయం సరికాదని విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆగమశాస్త్ర పండితులు, అర్చక స్వాములతో చర్చించకుండా పాలక మండలి వ్యవహరించిన తీరు సరికాదన్నారు. దేవాలయాల వైదిక కార్యక్రమాల్లో పాలకమండళ్లు జోక్యం చేసుకుని భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోరాదన్నారు.  చాతుర్మాస దీక్షలో భాగంగా హృషికేశ్‌లో ఉన్న స్వరూపానంద వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ.. మరోవైపు మహా సంప్రోక్షణ సమయంలో పరిమితంగా భక్తులను అనుమతించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి పాలక మండలి నిర్ణయాన్ని సరిచేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
టిటిడి పాలకమండలి నిర్ణయం సరికాదు: స్వరూపానందేంద్ర సరస్వతి https://www.telugumuchatlu.com/the-decision-of-ttd-governing-council-is-not-correct-swaroopanandra-saraswathi/
Tags:The decision of TTD Governing Council is not correct: Swaroopanandra Saraswathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *