యావర్ రోడ్డు విస్తరణలో గృహ సముదయాలపై నిర్ణయం వెల్లడించాలి

-జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెరపైకి జోన్ల మార్పిడి

-2017లోనే ప్రభుత్వం స్పందిస్తే కవితకు పెరొచ్చేది
– ప్రభుత్వ తీరును తప్పుపట్టిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 

జగిత్యాల ముచ్చట్లు:

 

జగిత్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని భావించి 2017లో యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని అప్పటి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే పట్టించుకోలేదని అప్పుడే చేస్తే ఎమ్మెల్సీ కవితకు పేరు వచ్చేదని మాజీ మంత్రి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల పట్టణ ప్రజల ప్రధాన సమస్య యవర్ రోడ్  వెడల్పు ను దృష్టిలో పెట్టుకొని 2017 లో యవర్ రోడ్ ను 100 ఫీట్ల రోడ్ వెడల్పు చేయాలని  కాంగ్రెస్ పార్టీకి చెందిన  మున్సిపల్  ఛైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన  పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసి  రాష్ట్రప్రభుత్వనికి నివేదించడం జరిగిందని, పదవికాలం ముగిసినఅట్టి  అభ్యర్థన పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఎంపీగా కవిత ఉన్నపుడు  ఎలాంటి అభివృద్ధి జరిగిన ఆమే సూచనల మేరకే జరిగేదని
యావర్ రోడ్ వెడల్పు విషయంలో రాష్ట్రప్రభుత్వం అప్పుడే  అధికారిక ఉత్తర్వులు ఇచ్చిఉంటే  కవితకు  పేరు వచ్చేది ఉండేదని అభిప్రాయపడ్డారు.

 

 

 

4 సంవత్సరాలుగా  జరిగిన జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే  కొత్తగా జోన్ ల మార్పిడి విషయాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. యవర్ రోడ్ ను 100 ఫీట్ల  విస్తరణ లో భాగంగా ఉన్న గృహసముదాయాల పై  ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని ప్రభుత్వ కార్యాలయలను ఎలా విస్తరించారో అలాగే ప్రైవేట్ గృహాలను కూడా విస్తరించి యవర్ రోడ్ వెడల్పును చేపట్టాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.వంద శాతం యావర్ రోడ్డు విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని, దాన్ని మేము స్వాగత్తిస్తామని వెల్లడించారు.  ప్రయివేటు గృహలు, గృహ సముదయాలను విస్తరించి 100 ఫిట్ల యావర్ రోడ్డును విస్తరణ చేయాలని,ఈవిషయంలో పాలకవర్గం నిర్ణయాన్ని వెల్లడించాలని  జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్ళెపెల్లి దుర్గయ్య,టీపీసీసీ కార్యనిర్వాహక  రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, గుంటి జగదీశ్వర్, గాజంగి నందయ్య,నేహాల్ తదితరులున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The decision on housing complexes in the Yawar Road expansion should be disclosed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *