పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు తరువాతే నిర్ణయం- ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

-జగన్‌ను ముఖ్యమంత్రిగా ఉండటాన్ని భరించలేకపోతున్నారు
– అంతవరకు ఎన్నికలకు వెళ్లం
-నిమ్మగడ్డ బాబు ఏజెంట్‌
-రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ ఎత్తుగడలు

Date:23/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, సుప్రీంకోర్టు తీర్పు తరువాతే ఎన్నికల గురించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ రమేష్‌కుమార్‌ ఏకపక్షంగా పంచాయతీరాజ్‌శాఖ అధికారులపై ఆరోపణలు చేయడం బాధకరమన్నారు. తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని, విశ్రాంత ఐఏఎస్‌ అధికారికి ర్ఖా•న్ని పాలించే అధికారం లేదనే విషయాన్ని గమనించాలని, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడాన్ని సహించలేక ఇలాంటి రాజకీయాలు నడుపుతున్నారని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మటుమాయమౌతుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పుంగనూరులో నియోజకవర్గ స్థాయి జాబ్‌మేళా కార్యక్రమాన్ని ఆయన, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌-19 వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు. గత సంవత్సర కాలంగా కరోనా నియంత్రణలో విశేష సేవలందించిన వారందరు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాక్సినేషన్‌ అవసరమన్నారు.

 

 

ఇలాంటి సమయంలో ఈసీ రమేష్‌కుమార్‌ చౌదరి తాను విశ్రాంత అధికారినన్న విషయాన్ని మరచి, రాజ్యాంగ పదవిలో ఉన్నామనుకుని పరిపాలన చేయాలంటే జరగదని హెచ్చరించారు. చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్‌ జారీ చేశారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో 600 హామిలతో ప్రజలను మోసగించిన చంద్రబాబునాయుడుకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని , దానిని గ్ర హించకుండ రమేష్‌కుమార్‌చౌదరి చంద్రబాబు ఏజెంటుగా పని చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌, కార్యదర్శులు ఈసీ కార్యాలయానికి వెళ్లినా వారిపై ఆరోపణలు చేయడం బాధకరమన్నారు. అలాగే సుప్రీంకోర్టులో తీర్పు వెలువడకుండానే జిల్లా కలెక్టర్లను, పోలీస్‌ అధికారులను మార్చడం హాస్యాస్పదమన్నారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. ఇకనైనా ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, పెద్దిరెడ్డి, అక్కిసాని భాస్కర్‌ రెడ్డి, కొండవీటి నాగభూషణం, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: The decision will come after the Supreme Court verdict on the panchayat elections – Minister Peddireddy fires on the EC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *