గ్రామాల్లో కొలువైన పీర్ల దేవుళ్ళు
భక్తిశ్రద్ధలతో ఇమామ్ ఖాసీం (గంటప్ప దేవుళ్ళు)
నేడు సరగసు
కులమతాలకు అతీతంగా అతిపెద్ద పండుగ మొహారం
కౌతాళం ముచ్చట్లు:
కౌతాళం మండలంలో గ్రామ గ్రామంలో కొలువైన పీర్లదేవుళ్ళు కులమతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవుళ్ళు పీర్లదేవుళ్ళు గ్రామ ప్రజలందరు 10 రోజులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముస్లిం లు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ మొహారం ఒకటి పది రోజులు పాటు జరిపే ఈ పండుగ సందర్భంగా ఇస్లాం కు సంబంధించిన ప్రవచనములు మొహమ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి మొహారం నెల పదోరోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున హజ్రత్ ఇమాం హుషేన్ ను గుర్తుగ పంజా ( ప్రతిమ) లను ఉరేగించి తమసంతాపం ప్రకటిస్తారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం తొలి మాసాన్ని మొహారం నెలగా భావిస్తారు. మొహారం పండుగ పదో రోజున ప్రత్యేకత ఉంది 10,11 వ రోజుల్లో ఉపవాస దీక్షలు పాటించడాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారు. మొహారం నెలలో ముస్లింలు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన హజ్రత్ ఇమామ్ హుషేన్ కు సంతాపం తెలిపే ఉద్దేశ్యం తో ముస్లింలు పాటిస్తారు.మానవ హక్కులకోసంజరిగిన చరితాత్మక పోరాటం మొహారం ఈ పేరు వినగానే పిర్లు, నిప్పుల గుండాలు గుండెలు బాదుకుంటు మతం చడవటాలు గుర్తుకువస్తాయి.మంగళవారం ఇమామ్ ఖాసీం సరగసు భక్తిశ్రద్ధలతో గ్రామ ప్రజలు జరుపుకున్నారు. ఉదయం పీర్లదేవుళ్ళు ఊరేగింపుగ వెళ్లారు.ఊరేగింపు లోప్రజాలు నైవేద్యాలు సమర్పించారు.

Tags: The deities of Pirla in the villages
