ఢిల్లీ మద్యం కుంభకోణం స్కామ్‌కు హైదరాబాద్‌లోనే కుట్ర
వేదిక ఐటీసీ కోహినూర్ హోటల్
న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీ మద్యం కుంభకోణంహైదరాబాద్‌లోనే జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీకీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కస్టడీ రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. ఐటీసీ కోహినూర్ హోటల్‌లోనే స్కామ్‌కు కుట్ర జరిగిందని తెలిపింది. సౌత్‌గ్రూప్ దినేష్ అరోరాను హైదరాబాద్‌కు పిలిచిందని, విజయ్‌నాయర్, అర్జున్ పాండే, అభిషేక్ బోయినపల్లి, కవిత ఆడిటర్ బుచ్చిబాబు అరుణ్ పిళ్లై కలిసే కుట్ర చేశారని ఈడీ స్పష్టం చేసింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును మరోసారి ప్రస్తావించింది. కేజ్రీవాల్‌తో కవితకు స్పష్టమైన రాజకీయ సంబంధాలున్నాయని, కవితకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులపై స్పష్టమైన అవగాహన కుదిరిందని కవిత ఆడిటర్ బుచ్చిబాబు విచారణలో వెల్లడించారని ఈడీ తెలిపింది. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉంటే ముడుపులు ఇస్తామని కవిత ఆప్ నేతలకు చెప్పారని ఈడీ తెలిపింది. 2021 మార్చిలో విజయ్‌నాయర్‌ను కవిత కలిశారని బుచ్చిబాబు చెప్పారని కస్టడీ రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. మాగుంట రాఘవకు 32.5శాతం, కవితకు 32.5శాతం… సమీర్ మహేంద్రుకు 35శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని, సౌత్ గ్రూప్ ద్వారా వందకోట్లు ఆప్‌కు చెల్లించారని ఈడీ తెలిపింది.
Tags;The Delhi Liquor Scam was a conspiracy in Hyderabad itself
