మట్టి కుండలకు గిరాకీ వేరప్పా

The fridge is like the water they love
  Date:15/03/2019
 తిరుపతి  ముచ్చట్లు:
సవిలో మట్టికుండలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రతి ఇంట్లో ఒక మట్టికుండ తప్పనిసరిగా ఉంటుంది. మట్టికుండలోని నీటిని తాగితే అమృతంతో సమానంగా భావిస్తారు. తిరుపతి నగరంలోని బైపాస్‌రోడ్డు, ముఖ్యమైన కూడళ్ల వద్ద మట్టికుండ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. తిరుపతికి వచ్చే యాత్రికులు కూడా చిన్న మట్టికుండ తీసుకుని వెళుతున్నారు. జిల్లాలో జరిగే సంత (వారాంతపు మార్కెట్‌)లో కూడా మట్టికుండల వ్యాపారం బాగానే జరుగుతోంది. ఇటు మన జిల్లాలో తయారుచేసే మట్టికుండలే కాకుండా, రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ మట్టికుండల వ్యాపారం చేస్తున్నారు. చిత్తూరుజిల్లా, రాజస్తాన్‌ రెండూ కరువు ప్రాంతాలు కావడంతో మట్టికుండల తయారీలో ఆరితేరిన వారు ఉన్నారు. మట్టికుండల వ్యాపారంలో రోజుకు వెయ్యిరూపాయల వరకూ వీరు ఆర్జిస్తున్నారు. మట్టి కుండలకు కొళాయిలు ఏర్పాటు చేయడం వల్ల అందం ఉట్టిపడుతోంది. ముఖ్యంగా తెల్లకుండ, నల్లకుండలకు గిరాకీ ఎక్కువగా ఉంది. చిత్తూరు, కడప, కర్నూల్‌తో పాటు రాజస్థాన్‌ నుంచి వచ్చి వ్యాపారం చేసేవారు పెచ్చు సంఖ్యలో పెరిగారు.ఇంట్లో ఫ్రిజ్‌ ఉన్న మట్టికుండలో రోజుకు ఒక బిందె నీళ్లు పోసి ఉంచితే చల్లగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు అంటున్నారు.
ఫ్రిజ్‌లో ఉన్న చల్లని నీరు తాగితే వేసవిలో గొంతు సంబంధిత సమస్యలతో పాటు, దగ్గు, వేడి జలుబు వచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్దలు అనేవారు. అయితే చాలా మంది మట్టికుండలో ఉన్న నీటినే తాగడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని భావిస్తారు. కుండ నీటికి, ఫ్రిజ్‌లోఉన్న నీటికి చాలా తేడా ఉంది.తిరుపతిలో రాజస్థాన్‌ కుండలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. రాజస్థాన్‌ నుంచి వచ్చిన వ్యాపారులు జిల్లాలో ఎక్కువగా కుండల వ్యాపారం చేస్తున్నారు. ఈ కుండలకు కుండపైన మూత ఉండటమే కాకుండా, నీళ్లు పట్టుకోవడానికి కొళాయి ఉండటంతో ఆకర్షణగా కనబడుతుంది. దీనివల్ల ఇటువంటి కుండలను తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కుండలు ఎక్కువగా ఎర్రరంగులో ఉంటాయి. పదిలీటర్ల కుండ అయితే రూ.200 ధర పలుకుతోంది. 15 లీటర్లు అయితే రూ.250, 20 లీటర్లు అయితే రూ.300లు ధర పలుకుతోందని రాజస్థాన్‌కు చెందిన మట్టికుండల వ్యాపారుడు దినేష్‌ పేర్కొన్నారు. మదనపల్లికి చెందిన నలుపుకుండ రూ.150, తెల్లకుండ రూ.200ల ధర పలుకుతోంది. మట్టిజెగ్గు రూ.130, కూజా రకం అయితే 15లీటర్లు నీరు పట్టేది రూ.150 ధర పలుకుతోంది. గత ఏడాది ఏప్రిల్‌ కంటే ఈసారి గిరాకీ తక్కువ ఉందని వ్యాపారులు అంటున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయితే మట్టికుండలకు మరింత ఆదరణ లభిస్తుందని వారు అంటున్నారు. మట్టి ధరలు పెరగడం వల్ల కుండల ధరలు కూడా పెంచాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు సహాయం చేస్తే తక్కువ ధరకే మట్టికుండలు అందిస్తామని మదనపల్లి వ్యాపారి చలపతి పేర్కొన్నారు.
Tags:The demand for clay pots is different

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *