అక్టోబరు 29లోగా రఫేల్‌ వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలి

The details of Rafael should be provided in the Sealed Cover by October 29

The details of Rafael should be provided in the Sealed Cover by October 29

కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశం
Date:10/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై బుదవారం  సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకున్న ప్రక్రియ గురించి వివరాలను అక్టోబరు 29లోగా సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, సాంకేతిక అంశాలకు  సంబంధించిన వివరాలు అవసరం లేదని కోర్టు వెల్లడించింది.‘మేము కేంద్రానికి నోటీసులు జారీ చేయడం లేదు. పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాం. వారి వాదనలు ఆమోదయోగ్యంగా లేవు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే రఫేల్‌ ఒప్పంద నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది.
దేశ రక్షణ అంశమైనందున వ్యయాల విషయాన్ని అడగబోమని కోర్టు స్పష్టం చేసింది.భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.59వేల కోట్లతో 36యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసో కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ వాదించారు. ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిందని, దీన్ని రాజకీయం చేస్తున్నారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.
Tags:The details of Rafael should be provided in the Sealed Cover by October 29

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *