The development of all is the goal of the government

అందరి అభివృధ్దే ప్రభుత్వ లక్ష్యం

– మహిళల అభ్యున్నతికోసం పథకాలు
– ఆసరా చెక్‌ల పంపిణీలో పెద్దిరెడ్డి
-ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

Date:16/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృధ్దే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఐకేపి కా ర్యాలయంలో మహిళా సంఘాల సభ్యులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన వెహోదటి విడతగా ఆర్థిక చేయూత ఆసరా కార్యక్రమంలో భాగంగా రూ:6.39 కోట్ల చెక్‌ను అందజేశారు.ఈ సంధర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు చేయని కొత్త పథకాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజల చెంతకు పాలన తేవాలనే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి ప్రపంచ దేశాలకు మన రాష్ట్రం తలమానీకంగా నిలిచిందని కొనియాడారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, ప్రజలకు పాదయాత్రలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు చెప్పని హామీలను సైతం అమలు చేసి ప్రతిపక్ష పార్టీ టిడీపీకు దిమ్మదిరిగేలా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. మండలంలో 814 సంఘాలకు రూ:25.57 కోట్లు ఆసరా ద్వారా చేయూతనిస్తున్నారని, దీని ద్వారా 8145మంది మహిళలు లబ్దిపొందుతున్నట్లు వివరించారు. మండలానికి వెహోదటి దశలో రూ:6.39 కోట్లు మంజూరై, ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయినట్లు చెప్పారు.వీటితోపాటు630 మంది సభ్యులకు నిధి ద్వారా రూ:3.15 కోట్లు రుణాలు ఇవ్వడంజరిగిందన్నారు. 21450మందికి వైఎస్సార్‌ భీమా లో నమోదు చేసి ఆదుకొంటున్నట్లు చెప్పారు. 1920 మంది మహిళలకు వైఎస్సార్‌ చేయూత ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిచారన్నారు. గ త ప్రభుత్వంలాగా కాకుండా జగనన్న ప్రభుత్వం ఇచ్చినమాటకు కట్టుబడి , చెప్పిన హామీలను నేరవేర్చుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో అధికశాతం మహిళలకోసం, వారి ద్వారా ఆయా కుటుంభాలకు చేయూతనిచ్చే పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వం పేదలకోసం అమలు చేసే పథకాలను విఓఏలు, సిబ్బంది ప్రజలకు వివరించి ప్రభుత్వంపై నమ్మకం పెంచి , ఎప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపీపీ మెంబరు అంజిబాబు, జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, రైల్వే బోర్డుమెంబరు మిద్దింటి శంకర్‌నారాయణ, మాజీ జెడ్పిటీసీ రుక్మిణమ్మ, మాజీ ఎంపీటీసీ పద్మనాభరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు, మిద్దింటి కిషోర్‌, వరుణ్‌,ఎంపీటీసీలు రూపారేఖ, శ్రీరాములు, ఎంపీడీఓ శంకరయ్య, తహసీల్దార్‌ మురళి, ఏపిఎం నర్వోత్తమరెడ్డి,సీసీలు నూర్‌ అహమ్మద్‌, రమేష్‌, సుగుణ తదితరులున్నారు.

లాక్ డౌన్ కు అందరూ సహకరించారు

Tags: The development of all is the goal of the government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *