Natyam ad

బడుగుల అభివృద్ధి జగనన్న పాలనలోనే

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరుగుతుందని , ఉమ్మడి పాలన వస్తే బడుగులకు కష్టాలేనని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన భగత్‌సింగ్‌కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించి , కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ కిజర్‌ఖాన్‌ లు సుబేదారువీధిలో ప్రచారం చేశారు. అలాగే పట్టణంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లలిత, మున్సిపల్‌ కౌన్సిలర్లు జయభారతి, అర్షద్‌అలి, పూలత్యాగరాజు, జెపి.యాదవ్‌, కొండవీటి నటరాజ, రెడ్డెమ్మ, రేష్మా, మమత, భారతి, ఆదిలక్ష్మీ, పద్మావతమ్మలు ఆయా వార్డులలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కర పత్రాలు పంపిణీ చేశారు. వీరితో పాటు దళితనాయకులు చెన్నరాయుడు, రాజు, పెంచుపల్లి కృష్ణప్పలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. చైర్మన్‌ అలీమ్‌బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Post Midle

Tags: The development of barangays was under Jagananna’s rule

 

Post Midle