తెదేపా పాలనలో ప్రజల మనస్సుల్లో నిలిచిపోయే అభివృద్ధి

The development of the minds of the people during the tenth reign

The development of the minds of the people during the tenth reign

Date:11/01/2019

పలమనేరు ముచ్చట్లు:

తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల మనసులో నిలిచే పోయే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ  నియోజకవర్గ సమన్వయ కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొలుత మంత్రి ఎన్టీఆర్ చిత్రటానికి పూజలు నిర్వహించి, పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…చరిత్రలో ఇప్పటిదాకా జరగని అభివృద్ధి నేడు జరుగుతోందని, రాష్ట్ర విభజనానంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం పాలనాదక్షతతో అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమైందన్నారు. జన్మభూమి-మా ఊరు సభలు విజయవంతంగా సాగడానికి ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలలో సంతృప్తి ఉండమమేనన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నాయకులు కృషి చేయాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలను దరి చేరేలా చూడాలని సూచించారు. టీడీపీ సభ్యత్వ నమోదును పూర్తి చేసినందుకు నాయకులను అభినందించారు. ఈ సమావేశంలో నాయకులు ఆర్వీ బాలాజీ, హేమంత్ కుమార్ రెడ్డి, రామచంద్రనాయుడు, బాలాజీ నాయుడులతో పాటు మండల పార్టీ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజ స్వామివారికి ముత్యాల కవచం

Tags:The development of the minds of the people during the tenth reign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *