వైఎస్‌.జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

The development of the state with YS Jagan

The development of the state with YS Jagan

– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:15/03/2019

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమౌతుందని, ఆయనను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేసి, వైఎస్సార్‌సీపీని అత్య్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పుంగనూరు మండలం చదళ్ల , గొల్లపల్లె, దండుపాళ్యెం , అలసాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ 2014లో ఇచ్చిన ఎన్నికల హామిలను నేరవేర్చకుండ 2019 ఎన్నికలకు రెండవ సారి ప్రజలను మోసగించేందుకు వస్తున్న చంద్రబాబునాయుడుకు తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫి , డ్వాక్రారుణాలు రద్దు, నిరుద్యోగభృతి, పెన్షన్లు, పక్కా గృహాల పథకాలు పేదలకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అవినీతి అక్రమాలతో తెలుగుదేశం ప్రభుత్వం కూరుకుపోయిందన్నారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాలను కాపికొట్టి, ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు మహిళలను , పేద ప్రజలను మోసగించేందుకు శ్రీకారం చుట్టారని ఎద్దెవా చేశారు. ఐదు సంవత్సరాలలో మహిళలకు పస్రుపు,కుంకుమ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని నిలధీశారు. ఓట్లు కోసం వచ్చే తెలుగుదేశం నాయకులకు తగిన గుణపాఠం నేర్పాలన్నారు. జిల్లాలో ప్రజలందరు ఐకమత్యంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్థులకు ఫ్యానుగుర్తుకు ఓట్లు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు విజయబాస్కర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, నేతలు రాజశేఖర్‌రెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, బాలచంద్రారెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

వివేకానందతో అనుబందం

Tags; The development of the state with YS Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *