వర్షం మూలంగా ధర్మ పోరాట దీక్ష వాయిదా

Date:19/10/2018
కడప ముచ్చట్లు:
కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా ఆధ్వర్యంలో జరగాల్సిన ధర్మ పోరాట దీక్ష భారీ వర్షం మూలంగా వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలోని తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్న సందర్భంగా వారం రోజుల నుంచి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి ప్రొద్దుటూరులో భారీ వర్షం కురిసింది. ఫలితంగా సభా ప్రాంగణంలోకి వర్షం నీరు చేరింది. వేదిక, పరిసర ప్రాంతాలన్నీ తడిసి ముద్దయ్యాయి. సభ నిర్వహణకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉండటంతో.. ప్రాంగణాన్ని చదును చేయడం కష్టమని పార్టీ నేతలు భావించారు. ఈ ఉదయం మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతా బురదమయంగా ఉండటాన్ని గుర్తించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. సభ వాయిదా వేయాలని నేతలకు సూచించారు. దీంతో ధర్మ పోరాట దీక్ష సభను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు నేతలు ప్రకటించారు.
Tags:The Dhamma fighting initiative is due to rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *