యానం ముచ్చట్లు:
యానాంకు చెందిన మత్సకారులకు ఒ.ఎన్.జి.సి కంపెనీ నుండి అందవలసిన పరిహారం వెంటనే అందచేయాలంటూ యానాం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద యానాం ఎమ్.ఎల్.ఏ గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ పిలుపుమేరకు మత్సకార యువత ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొన్నిరోజుల క్రితం అగ్నికులక్షత్రియ ఆత్మీయ సమావేశంలో మల్లాడి కృష్ణారావు పరిహారం కొరకు ఒ.ఎన్.జి.సి కంపెనీపై నిప్పులు చెరిగారు. ఫిబ్రవరి రెండవ తేదీన ఒ.ఎన్.జి.సి కంపెనీ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆంద్రప్రదేశ్ లో ఇప్పటికే నాలుగు విడతలుగా పరిహారం అందచేయగా, యానాంలో ఒక్క విడత మాత్రమే పరిహారం అందచేయడం జరిగింది.లబ్ధిదారుల ఎంపిక విషయంలో వివాదాలు ఉండడంతో పరిహారం ఆలస్యం అయినట్లుగా తెలియవస్తోంది. ఏది ఏమైనప్పటికీ తమకు పరిహారం వెంటనే అందచేయాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని యానాంమత్సకారులు ఒ.ఎన్.జి.సి కి పుదుచ్చేరి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Tags: The dharna demanded immediate compensation to the fishermen