రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు

-సోషియల్ వర్కర్ తల్లా శ్రీనివాస్

Date:25/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు అని సామాజిక కార్యకర్త తల్లా శ్రీనివాసులు పేర్కొన్నారు.సోమవారం కమ్యూనిటీ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో ఎస్వీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జనార్దన్ రెడ్డి అధ్యక్షత న కళాశాల లో జాతీయ ఓటరు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో జమీందార్లకు,పన్నులు కట్టే సంపన్నులకు ప్రముఖులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని అన్నారు.కానీ భారత రత్న డాక్టర్.బీఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ప్రతి భారత వయోజనులందరూ ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అర్హులుగా చేశారన్నారు. ఓటు హక్కు మన జన్మ హక్కు గా భావించాలని, ఓటు హక్కు బాధ్యత మరువద్దని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం కలిగిందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: The diamond weapon given by the constitution is the right to vote

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *