దిశ ఘటన దేశం తలదించుకునేలా చేసింది

The direction of the event caused the country to go up

The direction of the event caused the country to go up

Date:02/12/2019

దిల్లీ ముచ్చట్లు:

దిశ హత్యాచార ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. లోక్‌సభలో దిశ ఘటనపై ఆయన మాట్లాడారు. ‘ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది. ప్రతి ఒక్కరినీ బాధించింది. దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. చట్టాల్లో మార్పులు చేసే విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో పాటు పలువురు ఎంపీలు దిశ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. దోషులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు.

 

వెటర్నరీ డాక్టర్ హత్య.. మద్రాసు హైకోర్టు తీర్పు ప్రభుత్వాలకు చెంపపెట్టు

 

Tags:The direction of the event caused the country to go up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *