పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వాజ్ పేయి చిత్రపటం ఆవిష్కరణ

The discovery of the Vazhay Peeve in Parliament Central Hall
Date:12/02/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మాజీ ప్రధాని వాజ్‌పెయీ చిత్రపటం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ… వాజ్‌పేయీకి భారతరత్న ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది. వాజ్‌పేయీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. విలక్షణ వ్యక్తిత్వంతో వాజ్‌పేయీ అందరికీ ఆదర్శంగా నిలిచారు. వాజ్‌పేయీ గడిపిన సాధారణ జీవితం అందరికీ ఒక పాఠం నేర్పింది. రాజకీయవేత్తగా, కవిగా, అసాధారణ ప్రతిభావంతుడిగా అందరిపై ప్రభావం చూపారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన చూపిన రాజనీతజ్ఞత అసమానం. జీవితాంతం తాను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడి జీవించారు. అణుపరీక్ష, కార్గిల్‌ యుద్ధం వంటి కీలక ఘట్టాలు ఆయన దైర్యానికి ప్రతీకలని కొనియాడారు.
TagsThe discovery of the Vazhay Peeve in Parliament Central Hall

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *