శ్రీ కపిలేశ్వరాలయంలో దేవీనవరాత్రి ఉత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

The discovery of the wallpapers of the Devanavaratri celebrations at Sri Kapileswaram

The discovery of the wallpapers of the Devanavaratri celebrations at Sri Kapileswaram

Date: 17/0/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబ‌రు 29 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీ దేవీనవరాత్రి ఉత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుప‌తి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

 

 

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ దేవీన‌వ‌రాత్రి ఉత్స‌వాలు సెప్టెంబ‌రు 29న క‌ల‌శ‌స్థాప‌న‌తో ప్రారంభ‌మై, అక్టోబ‌రు 8న క‌ల‌శాభిషేకం, పార్వేటి ఉత్స‌వంతో ముగుస్తాయ‌ని తెలిపారు. సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 7వ తేదీ వరకు ప్ర‌తిరోజూ ఉద‌యం స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రుగుతుంద‌ని, సాయంత్రం ఊంజ‌ల్‌సేవ‌లో శ్రీకామాక్షి అమ్మవారు ప్ర‌త్యేక అవ‌తారంలో భక్తులకు దర్శనమిస్తార‌ని వివ‌రించారు. సెప్టెంబ‌రు 30న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 1న ఆదిప‌రాశ‌క్తి, అక్టోబరు 2న శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 3న మావడి సేవ, అక్టోబరు 4న శ్రీ లక్ష్మీదేవి, అక్టోబరు 5న శ్రీ దుర్గాదేవి, అక్టోబ‌రు 6న శ్రీ స‌రస్వతి దేవి, అక్టోబరు 7న శ్రీ మహిషాసురమర్థిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని తెలియ‌జేశారు.

 

 

 

అక్టోబరు 8న విజ‌య‌ద‌శ‌మినాడు శ్రీ శివ‌పార్వ‌తులు ద‌ర్శ‌న‌మిస్తార‌ని, అదేరోజు పార్వేట ఉత్సవం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్   భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్   రెడ్డిశేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

సెప్టెంబ‌రు 25వ తేదీకి  శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి :

 

Tags: The discovery of the wallpapers of the Devanavaratri celebrations at Sri Kapileswaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *