అస్తవ్యస్థమే…ఎల్ ఈడీ బల్బుల నిర్వహణ

The disorder is ... El Eddy bulbs management

The disorder is ... El Eddy bulbs management

Date:08/10/2018
విజయనగరం ముచ్చట్లు:
గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఇడి వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్థంగా తయారయ్యింది. ఇప్పటి వరకూ ఎంపిక చేసిన తొమ్మిది జిల్లాల్లో ఎల్‌ఇడి బల్బుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. 2,132 గ్రామాల్లో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌, నెడ్‌ క్యాప్‌ సంస్థలు 23,90,726 బల్బుల్ని ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకూ 5,628 గ్రామాల్లో 15 లక్షల్ని ఏర్పాటు చేశారు. వీటిలో మరమ్మతులకు గురైన, పని చేయని బల్బులకు రిపేర్‌ చేసే టెక్నీషియన్స్‌ తగిన సంఖ్యలో అందుబాటులో లేరు. దీంతో గ్రామాల్లో అంధకారం నెలకొంటోంది. ఎల్‌ఇడి బల్బుల మరమ్మతుల బాధ్యతల్ని ఎజన్సీలకు అప్పగించారు. ఎజన్సీలు మండలానికో టెక్నిషియన్‌ను మాత్రమే నియమించాయి.
మండలంలో 20 నుంచి 30 గ్రామాల వరకూ ఉండటంతో ఒక్క టెక్నిషియన్‌తో మరమ్మతులు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఒక్కో బాక్స్‌కు 50 బల్బుల్ని కనెక్ట్‌ చేయడం వల్ల చిన్న సమస్య ఎర్పడినా మిగతావన్నీ పని చేయడంలేదు. గ్రామాల్లో చంద్రకాంతి అంటూ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసుకుంటున్నా ప్రజలు మాత్రం ఎల్‌ఇడి బల్బుల నిర్వహణ సమస్యలతో సతమతమవుతున్నారు. సిసిఎంఎస్‌ సమాచారం ఆధారంగా అమర్చిన ఎల్‌ఇడి దీపాల్లో 85 శాతం పని చేస్తుండగా, 15 శాతం పని చేయడం లేదు.
వర్షాల కారణంగా బల్బులు మరమ్మతులకు గురవుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇటీవల జరిగిన శాసనసభలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల సిఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా విజయనగరం నుంచి ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎల్‌ఇడి బల్బుల మరమ్మతులకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఏకరువుపెట్టారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు సిఎం సూచించారు.
కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, పని చేయని బల్బుల సమాచారాన్ని సేకరించి, మరమ్మతులకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పని చేయని ఎల్‌ఇడి బల్బుల్ని వెంటనే గుర్తించి ఆయా పంచాయతీ కార్యదర్శులకు, ఎజన్సీలకు, టెక్నిషియన్స్‌కు రియల్‌టైంలో సమాచారం అందించి మరమ్మతులకు చర్యలు చేపట్టాలని పిఆర్‌ అధికారులు భావిస్తున్నారు. ఇందుకు నెల రోజులు సమయం పడుతుందని అంటున్నారు. ఈలోగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసే పనిలో నిమగమయ్యారు.
Tags:The disorder is … El Eddy bulbs management

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *