-కంటైన్మెంట్ జోన్లలో ఖచ్చితంగా లాక్ డౌన్ ను అమలు చేయడం జరుగుతుంది
-· 65 సం. ల పైబడిన వారు, 10 సం.ల లోపు పిల్లలు, గర్భిణీలు బయట తిరగరాదు
– కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న 60 సం. ల పై బడి దీర్ఘాకాలిక వ్యాధులు కలిగిన వారికి కరోనా పరీక్షలు
– ప్రజలందరూ ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి . . బయటకు వచ్చిన సమయంలో భౌతిక దూరం తప్పనిసరి
– జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త
Date:04/05/2020
చిత్తూరు ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 4 కరోనా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ కేసులు ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా, 4 కేసులకంటే తక్కువ ఉన్న ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్ గా, ఎటువంటి కేసులు లేని ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రభుత్వం నిర్ధారించడం జరిగిందని, చిత్తూరు జిల్లా రెడ్ జోన్ లో కలదని, చిత్తూరు టౌన్, పుత్తూరు మరియు శ్రీకాళహస్తిలు కంటైన్మెంట్ జోన్ ల కింద కలదని, రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో అన్ని భవన నిర్మాణ పనులు మరియు, పరిశ్రమలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మంది సిబ్బందితో నడుపుటకు అనుమతి కలదని, పట్టణ ప్రాంతాలలో మార్కెట్ జోన్, షాపింగ్ కాంప్లెక్స్ లకు అనుమతి లేదని, నివాస గృహాల మధ్య ఉన్న చిన్న చిన్న దుకాణాల నిర్వహణకు అనుమతి కలదని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ లను ఖచ్చితంగా ధరించి బయటకు రావాలని తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న 60 సం.ల పై బడిన దీర్ఘాకాలిక వ్యాధులు కలిగిన వారికి కరోనా పరీక్షల నిర్వహించడం జరుగుతుందని, 65 సం.ల పైబడిన వారు, 10 సం.లలోపు పిల్లలు, గర్భిణీలు బయట తిరగరాదని తెలిపారు. చిత్తూరు జిల్లాకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చి లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన వారికి రిలీఫ్ క్యాంప్ ల నందు వసతి ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారు మినహా మిగిలిన జిల్లాలకు చెందిన వారిని మరియు ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిని కూడా పంపడం జరుగుతున్నదని, గుజరాత్ కు చెందిన 60 మందిని పంపామని, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి సొంత వాహనాలు ఉన్నట్లైతే వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత 23 రోజులుగా జిల్లాలో పాజిటివ్ కేసుల నమోదు శాతం తగ్గిందని తెలిపారు.
జిల్లా ఎస్.పి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రెడ్ జోన్ లో ఉన్నందున కంటైన్మెంట్ జోన్ లలో కఠినమైన లాక్ డౌన్ నియమ నిబంధనలు ఉంటాయని, బార్బర్ షాపులకు, ఆటోలు, ట్యాక్సీలకు పర్మిషన్లు లేవని, టూ వీలర్లలో ఒకరికి, ఫోర్ వీలర్లలో ఇద్దరికీ ప్రయాణానికి అనుమతి కలదని, అంతర్రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతి లేదని తెలిపారు. నేటి నుండి తెరవబడుతున్న మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, ఇందులో భాగంగా బ్యారీకేడింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి, ఎక్సైజ్, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయడం జరుగుతున్నదని తెలిపారు.
Tags: The district collector Dr Devendra Kumar said that so