చౌడేపల్లి లో నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

-వ్యవసాయ మరియు వెటర్నరీ డిప్లమా కోర్సు లకు మంచి ఉపాధి అవకాశాలు .

 

చౌడేపల్లి ముచ్చట్లు:

వ్యవసాయ మరియు వెటర్నరీ డిప్లమా కోర్సులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయి పర్యటన లో భాగంగా చౌడేపల్లి లో వ్యవసాయ పాలిటెక్నిక్,సదుం లో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూత్వరితగతిన ఉపాధి అవకాశాలు పొందేందుకు వ్యవసాయ మరియు వెటర్నరీ డిప్లమా కోర్సులు తోడ్పడతాయని, ఈ ప్రాంతంలో వ్యవసాయ మరియు వెటర్నరీ పాలి టెక్నిక్ కళాశాలల ఏర్పాటు ద్వారా చాలా మంది విద్యార్థులకు వ్యవసాయ,పశు ఆధారిత రంగాల పై ఆసక్తి ఉన్న వారందరూ ఈ కోర్సులను పూర్తి చేసి ఉపాధి అవకాశాలను ఏర్పరచుకోగలరన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతాతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.వ్యవసాయ,వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులు ఇప్పటి వరకు 40 శాతం పూర్తి కాబడినవని కార్పొరేట్ సోషల్ రెస్పాంసబిలిటీ ఫండ్ కింద కళాశాల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని ఏపిఇడబ్ల్యూఐడిసి ఈఈ శివ ప్రసాద్ కలెక్టర్ కు వివరించారు.ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Tags:The District Collector inspected the construction work in Chaudepally

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *