ఆసిఫాబాద్‌ జిల్లాలు యాపిల్స్ సాగు జోరు

The districts of Asifabad are cultivated with apples

The districts of Asifabad are cultivated with apples

Date:15/08/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలు యాపిల్స్ సాగు జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడమే కారణం.. అయితే… ఓ వైపు చలి తీవ్రతతో కూడిన వాతావరణం కొంతమందికి ఇక్కడ రైతాంగానికి  అనుకూలంగా మారుతోంది. దీంతో కాశ్మీర్‌లో ఉండే వాతావరణ పరిస్థితులతో ..అలాంటి ఆపిల్స్‌ ఇక్కడ పండుతున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలోని దనోరా ప్రాంతం యాపిల్స్‌ సాగుకు అనుకూలంగా మారింది.
గత కొంతకాలంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో… యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉంటుందని భావించిన  రైతు… కాశ్మీర్‌లో ఉన్న తన బంధువుల వద్ద నుంచి యాపిల్‌ మొక్కలు తెప్పించాడు. వాటిని జాగ్రత్తగా సాగు చేయడంతో అవి చెట్లుగా మారాయి. రెండేళ్లుగా కొద్దికొద్దిగా కాపు కాస్తున్నాయి. అయితే.. ఈ విషయం తెలుసుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు… ధనోరా ప్రాంతంలో అనేక ప్రయోగాలు చేశారు. ఇక్కడ వాతావరణం యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉందని నిర్దారించారు.
దీంతో… ఉద్యానవన శాఖ రంగంలోకి రైతులకు యాపిల్‌ మొక్కలు పంపిణీ చేశారు.కొమురంభీం జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామాము లో వినూత్న రీతిలో కాశ్మీర్ ఆపిల్ ను తెలంగాణా రాష్ట్రంలోని మారుమూల గిరిజన గ్రామాము లో సాగు చేస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నాడు వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలాజీ ….తనకున్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు …చుట్టూ ఎతైన కొండలు ఎంతో సుందరంగా గా ఉండే ధానోరా గ్రామం ఏ కాలంలో నైనా శీతలంగా ఉంటుంది …మరో వైపు సీసీఎంబీ శాస్త్రవేత్తల కు తెలియడంతో వారు వచ్చి భూసార పరీక్షలు జరిపి ఈ ప్రాంతం ఆపిల్ సాగుకు అనుకూలమని తేల్చారు.2014 నుండి సీసీఎంబీ వారు సూచిన మేరకు మొక్కలు తెచ్చి సాగు చేయడం ప్రారంభించాడు మొదట 150 మొక్కల తో సాగు ప్రారంభించిన బాలాజీ మరో 350 మొక్కలు తెచ్చి సాగు చేస్తున్నట్లు చెప్పారు..తన వ్యవసాయ క్షేత్రంలో ఎటు వైపు చూసిన పండ్ల మొక్కల తో నిండు పచ్చ దనముతో పలకరించినట్టుగా ఉండటంతో చుట్టూ పక్కల గ్రామాల కు చెందిన  ఆదర్శ రైతులు సైతం తన క్షేత్రానికి వచ్చి సాగు పై మెలుకువలను సలహాలను తీసుకొని పోతున్నట్లు బాలాజీ తెలిపారు   ఁ
పూర్తిగా సేంద్రియ ఎరువుల తో సాగు చేస్తున్నట్లు రైతు బాలాజీ చెపుతున్నాడు …నాలుగేళ్ల నుంచి  రైతుల  చేస్తున్న ప్రయత్నాలతో ….మరో రెండు సంవత్సరాలలో అసిఫాబాద్ ఆపిల్ మార్కట్లోకి రానుంది…..బాలాజీ తనకున్న వ్యవసాయ క్షేత్రంలో ఆపిల్ సాగు తో పాటు అంతర్ పంటలుగా బత్తాయి… మిర్చి…దానిమ్మ… మామిడి…అరటి పండ్ల చెట్లను సాగు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు .
తెలంగాణ లొనే ధానోరా గ్రామానికి పేరు ప్రఖ్యాతలు రావడానికి కృషి చేస్తున్న బాలాజీ ని పలువురు రైతులు అభినందింస్తున్నారు …బాలాజీ ని  ఆదర్శంగా తీసుకొని పలువురు రైతులు ఆపిల్ సాగుకు సిద్ధమవుతున్నారు. సేంద్రీయ ఎరువులు వాడుతూ ఆపిల్‌ చెట్లను కాపాడుకుంటున్నట్లు రైతు చెబుతున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. యాపిల్‌ దిగుబడులు పెరిగితే ఇకపై మార్కెట్‌లో ఆదిలాబాద్‌ యాపిల్స్‌ కూడా దర్శనమివ్వనున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్‌లో లభిస్తున్న కాశ్మీర్‌, హిమాచల్‌ ఆపిల్స్‌కు గట్టి పోటీ ఇస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Tags:The districts of Asifabad are cultivated with apples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *