అయ్యప్పమీద ఉన్న శునకం భక్తి

కాలినడకన స్వాముల వెంట480 కిలోమీటర్లు ప్రయాణం

Date:18/11/2019

బెంగళూరు ముచ్చట్లు:

ఓ వీధి కుక్క శబరిమల వెళుతున్న అయ్యప్ప స్వాముల బృందాన్ని అనుసరిస్తోంది. స్వాముల వెంట నడుచుకుంటూ.. ఏకంగా 480 కిలోమీటర్లు ప్రయాణించింది. అయ్యప్పమీద ఉన్న శునక భక్తిని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ముదాబుద్దీన్ నుంచి గురుస్వామి రాజేష్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వాముల బృందం శబరిమల బయలుదేరింది. వారంతా అక్టోబర్ 31న తిరుపతి నుంచి కాలినడకన తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 480 కి.మీ. ప్రయాణించారు.తిరుమలలో అయ్యప్పస్వాములు బయలుదేరినప్పుడు ఓ కుక్క వారికి తోడైంది. వారినే అనుసరిస్తూ వెనుకనే వెళ్లింది. మొదట్లో స్వాములు ఆ కుక్కను గమనించలేదు. ప్రయాణం కొనసాగుతున్నకొద్దీ కుక్క కూడా వారివెంట రావడాన్ని స్వాములు గుర్తించారు. అప్పటి నుంచి స్వాములు తయారు చేసుకున్న ఆహారంలో కుక్కకు కూడా కొంత పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 480 కి.మీ. ప్రయాణంలో కుక్కకు చాలాసార్లు గాయాలు అయ్యాయి. మధ్యలో డాక్టరుచేత చికిత్స చేయించామని స్వాములు చెప్పారు. కుక్కను కూడా తమతోపాటు శబరిమల తీసుకువెళతామని తెలిపారు. ప్రతి ఏటా కాలినడకన శబరిమలకు వెళతున్న తమకు ఈసారి కుక్క తోడు రావడం కొత్త అనుభవమని అయ్యప్పస్వాములు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు

 

Tags:The dog on Ayyappa is devotion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *