డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ని పెడితే సెట్‌ అవుతారు:విహెచ్

Date:18/05/2019

హైదరాబాద్‌ముచ్చట్లు:

గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగానే పనికొస్తాడని సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ని పెడితే సెట్‌ అవుతారని ఎద్దేవాచేశారు. మేం ఏ వినతి ఇచ్చినా గవర్నర్‌ చెత్తలో పడేస్తున్నారని విమర్శించారు. ఇక అధికార అహంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం హాజీపూర్ సమస్యను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస జ్ఞానంలేదని ధ్వజమెత్తారు. బస్సు సౌకర్యం, వంతెన నిర్మించడంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

19న వైశ్య  బిజినెస్ నెట్ వ‌ర్క్ డైమండ్ 4వ చాప్ట‌ర్ ప్రారంభోత్స‌వం

 

Tags: The dollar will be set up beside the Seshadri and the governor: VH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *