ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి పొరపాట్లు ఉంటే తెలియచేయవచ్చు
-రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
కర్నూలు ముచ్చట్లు:
ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి పొరపాట్లు ఉంటే సంబంధిత అధికారులకు తెలియచేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 27 వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగిందన్నారు.. రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి, అందులో ఏమైనా తప్పులు , పొరపాట్లు జరిగి ఉంటే సంబంధిత ఏ ఈ ఆర్ఓ , ఈ ఆర్వో , బి ఎల్ ఓ లేదా జిల్లా ఎన్నికల అధికారి కి సంబంధిత ఫారం లో డిసెంబర్ 9 వ తేదీ లోపు అందజేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.. చనిపోయినా లేదా శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారినా, వారి ఓట్లు తొలగించడానికి ప్రత్యేక ఫారాలను విడి విడిగా ఇవ్వాలని కోరారు.
పై సవరణలన్నీ పూర్తి అయిన తర్వాత ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా వచ్చే జనవరి 5 వ తేదీ న ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని జిల్లా ఎన్నికల అధికారి తెలియజేశారు.
*కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బెల్ కంపెనీ నుంచి 16 మంది ఇంజనీర్లు అక్టోబర్ 16 వ తేదీ నుండి ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేస్తున్నారని, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి అయిన తర్వాత నమూనా పోలింగ్ నిర్వహించబడుతుందని, అందులో కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు.

*స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని… నవంబర్ 4వ మరియు 5వ తారీకు ( శనివారం , ఆదివారం)లలో మరియు డిసెంబర్ నెల 2వ మరియు 3వ తారీకు (శనివారం , ఆదివారం)లలో నిర్వహించడం జరుగుతుందని , కావున రాజకీయ పార్టీలు , ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. కొత్తగా ఓటర్లు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలియజేశారు.పార్టీల ప్రతినిధులు వారు గమనించిన పోలింగ్ స్టేషన్ వారీగా ఉన్న సమస్యలను జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని రావలసిందిగా కోరారు. *ఈ సమావేశానికి ఇంఛార్జి డి ఆర్ ఓ మల్లికార్జునుడు , రాజకీయ పార్టీ ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ లీగల్ జనరల్ సెక్రెటరీ పుల్లారెడ్డి , కాంగ్రెస్ పార్టీ తరఫున బి. టి. స్వామి , తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.వి. ప్రసాద్ పాల్గొన్నారు.
Tags: The draft voter list can be checked and any mistakes can be reported
