నెరవేరనున్న  పాలమూరు ప్రజల కల

The dream of the Palmuri people in fulfillment

The dream of the Palmuri people in fulfillment

Date:06/10/2018
పాలమూరు ముచ్చట్లు:
పాలమూరు పట్టణ వాసులు దశాబ్దాల కల నెరవేరుతోంది. 36 సంవత్సరాలుగా ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన జరిగి ఇన్నాళ్లకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రభుత్వం నిధులు కేటాయించినందున త్వరలో బైపాస్ నిర్మాణానికి సర్వే జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. అయితే బైపాస్ రోడ్డు నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు నిర్మిస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.
ఇప్పటి వరకు ఎనుగొండ నుంచి పాల్కొండ మీదుగా క్రిష్టియన్‌పల్లి, పాలమూరు యూనివర్సిటీ వరకు నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ప్రస్తుతం పాలమూరు పట్టణం మరింతగావిస్తరించడంతో బైపాస్‌ రోడ్డును హౌజింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న యూబీ గార్డెన్ నుంచి పాల్కొండ గ్రామ సమీపం మీదుగా, భూత్పూర్, మహబూబ్‌నగర్ రోడ్డు వరకు నిర్మించే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
బైపాస్‌రోడ్డు నిర్మాణంతో సమీపంలో భూములకు రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  మహ బూబ్‌నగర్ పట్టణ ఫరిధిలోని భూములకే కాకుండా భూత్పూర్ మండల పరిధిలోని అమిస్తాపూర్, తాటికొండ, గాజులపేట తదితర గ్రామాల పరిధిలోని భూముల విలువలు ఒక్కసారిగా పెరగనున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాలమూరు పట్టణ ప్రజలతోపాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:The dream of the Palmuri people in fulfillment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *