కలల ప్రపంచం …కళ్ల ముందే కుప్పకూలింది

The dream world collapsed before the eyes

The dream world collapsed before the eyes

 Date:15/09/2018
నల్గొండ ముచ్చట్లు :
తెలంగాణలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్‌  చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితులు అమృత తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్ కుమార్ లను గోల్కొండ పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అల్లుడు ప్రణయ్ ను తానే హత్య చేయించానని మారుతీరావు అంగీకరించాడు. కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులస్తుడిని పెళ్లి చేసుకోవడంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు వెల్లడించాడు.
ప్రణయ్ ను హత్య చేసేందుకు రూ.10 లక్షలతో డీల్ కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాడు. బంద్ నేపథ్యంలో నగరంలోని దుకాణాలు, షాపులు మూతపడ్డాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రేమ వివాహం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటపై కత్తిగట్టారు. పక్కా ప్రణాళికతో ఆ యువకుణ్ని మాటువేసి హత్య చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలే చోటుచేసుకున్న ఈ దారుణం సంచలనం సృష్టించింది.మిర్యాలగూడలోని వినోభా నగర్‌కు చెందిన ప్రణయ్‌ కుమార్‌ 6 నెలల కిందట అమృత వర్షిణి అనే యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు అడ్డుచెప్పగా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వేరు కాపురం పెట్టి తమ జీవితం తాము గడుపుతున్నారు.అమృత ఇటీవల గర్భం దాల్చింది. దీంతో ప్రణయ్ ఆమెను మిర్యాలగూడలోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు.
వైద్యురాలిని కలిసిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఆస్పత్రి గేటు వద్ద మాటువేసిన ఓ దుండగుడు వెనక నుంచి వచ్చి ప్రణయ్‌పై కత్తితో దాడి చేశాడు. ప్రణయ్‌ మెడపై రెండు సార్లు నరికాడు. ఒక్క వేటుకే అతడు కిందకూలిపోయి విలవిల్లాడుతూ అక్కడికక్కడే మరణించాడు పెరుమాళ్ల ప్రణయ్‌ను హత్యకు సూత్రధారిగా భావిస్తున్న అమృత తండ్రి తిరునగరు మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్‌ హైదరాబాద్‌ వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే నల్లగొండ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సివుంది. ప్రణయ్‌ను హత్యకు అరగంట ముందు వీరు మిర్యాలగూడ వదిలివెళ్లిపోయారు. మరోవైపు ప్రణయ్‌ ఇంటి ముందున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలు వెల్లడయ్యాయి. హంతకుడు గత నెల 22న కూడా ప్రణయ్ కారును ఫాలో అయినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దుండగుడు బైకుపై ప్రణయ్‌ కారును అనుసరించినట్టు స్పష్టంగా కనబడింది. ఇతడే జ్యోతి ఆస్పత్రి వద్ద ప్రణయ్‌ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ప్రణయ్‌, అమృత ఏడాది క్రితమే పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే అమృతకు మైనార్టీ తీరకపోవడంతో వీరికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆరు నెలల క్రితం అమృతకు మైనార్టీ తీరడంతో హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. కొంత అక్కడే ఉండి తర్వాత మిర్యాలగూడకు వచ్చారు.
కాగా పట్టణంలోని పలువురు ప్రముఖులతో కలసి తన కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాదు ప్రణయ్‌ను చంపేస్తానని పెద్ద మనుషులందరీ ముందు మారుతీరావు బెదిరించాడు. ప్రణయ్‌ హత్యకు గురయ్యాడు. కిరాయి హంతకుడితో అతడే ఈ హత్య చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఐదో నెల గర్భంతో ఉన్న అమృత ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని డాక్టర్‌ జ్యోతి తెలిపారు. తన ఆస్పత్రి ముందే ప్రణయ్‌ హత్యకు గురయ్యాడని, ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. భర్త చనిపోయిన విషయాన్ని అమృతకు చెప్పానని, ఆమెకు రక్తపోటు ఎక్కువగా ఉందని తెలిపారు.
పాలీహౌస్‌, డెయిరీ ఫామ్‌ పెట్టాలనుకుంటున్నట్టు ప్రణయ్‌ తనతో చెప్పాడని, విదేశాలకు వెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు వెల్లడించాడన్నారు.ప్రణయ్‌ అంత్యక్రియలు ఆదివారం జరిగే అవకాశముంది. అతడి సోదరుడు విదేశాల నుంచి రావాల్సివుంది.
మరోవైపు ప్రణయ్‌ ఇంటికి దళిత సంఘాల నాయకులు, రాజకీయలు నేతలు పోటెత్తారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తదితరులు శనివారం ప్రణయ్‌ ఇంటికి వచ్చి అతడి తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రణయ్‌ హత్యకు నిరసరగా మిర్యాలగూడలో దళిత సంఘాలు బంద్‌ నిర్వహిస్తున్నాయి.
Tags:The dream world collapsed before the eyes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *