ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం

Date:09/11/2019

విశాఖపట్నం ముచ్చట్లు:

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కేంధ్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన రిజర్వు బ్యాంకు నిధులు కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నుంచి ప్రజలు కోలుకోకు ముందే జిఎస్టిని అమల్లోకి తీసుకొచ్చి ఇబ్బందులు సృష్టించారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రధాని మోడీ దృష్టి సారించేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విదంగా దేశంలో నిరుద్యోగ సమస్య వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైభవంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు

Tags: The economy is fragile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *