ఫలితాల ముందు వైసీపీకి ఊహించని షాకిచ్చిన ఎన్నికల కమిషన్

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు (AP Election Results) మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయ్. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీకి ఎన్నికల కమిషన్ ఊహించని ఝలక్ ఇచ్చింది.పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు హైకోర్టు..ఇటు ఎన్నికల కమిషన్‌ను వైసీపీ నేతలు సంప్రదించారు. అయితే ఈసీ మాత్రం వైసీపీ లేవనెత్తిన విషయాలపై ఘాటుగానే రిప్లయ్ ఇచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. దీంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలినట్టయ్యింది.

ఇటు హైకోర్టుకు.. అటు ఆదేశాలు..!

ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బల్లెట్లను వ్యాలిడ్ చేయాలని క్లియర్ కట్‌గా ఈసీ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాయడం జరిగింది. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఈ రోజు వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చిందని.. తద్వారా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్‌లో వైసీపీ పేర్కొంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా ఇవాళే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం సిద్ధమైంది. ఈలోపే సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేయడంతో వైసీపీ కంగుతిన్నది. మరి హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందో అనేదానిపై వైసీపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Tags:The Election Commission gave YCP an unexpected shock before the results

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *