ఎన్నికల సంఘం షాక్

విజయవాడ ముచ్చట్లు:


సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పాలన సౌలభ్యం కోసమంటూ ఈ ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వాలంటీర్ల  వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల ద్వారానే.. అన్ని పనులు కొనసాగుతున్నాయి. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించడంతో.. ఏం జరిగినా వారి కనుసన్నలోనే సాగుతోంది. అయితే కొందరు వైసీపీ నేతలు  వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నా.. వచ్చే ఎన్నికలకు వారే ఉపయోగపడతారనే అంచనాలోనే కొందరు నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ కు షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం.. చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.కె. మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల కార్యక్రమాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి అని స్పష్టం చేశారు. దీనిపై జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎం.కె. మీనా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఎవరైనా అలాంటి పనులు అప్పగిస్తే పక్కన పెట్టాలని సూచించారు. ఏపీ పాలనా వ్యవస్థలో వాలంటీర్లు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్.. ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.

 

 

వాలంటీర్‌లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియలో వాలంటీర్లను భాగస్వాములు చేయొద్దని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలకు సంబధించిన ఏ ప్రక్రియలోనూ వారికి విధులు అప్పగించవద్దని కలెక్టర్లకు ఎన్నికల కమిషన్ సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించి.. అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏ అభ్యర్థి తరఫున వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకూడదని తెలిపింది. ప్రభుత్వ వేత‌నం తీసుకుంటున్నందున వారిని భాగ‌స్వాముల‌ను చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.అలాగే ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోలింగ్ ఏర్పాట్లు, పోలింగ్ విధులు, ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు పాల్గొనరాదని ఎన్నికల సంఘం సూచించింది. అటు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు కూడా వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించరాదని ఆదేశించింది.ఆయా జిల్లాల క‌లెక్టర్లు, ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా ముఖేష్ కుమార్ మీనా ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ‌, వార్డు వాలంటీర్లు ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గతంలో కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్..
రాష్ట్ర ఎన్నికల సంఘం నియమాల ప్రకారం…

 

 

గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను ఎలక్షన్స్‌కు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉండాలి
ఏ అభ్యర్థి తరఫున కూడా వాలంటీర్స్ పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు
ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ చేయకూడదు
పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు
రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు వాడలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు
ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఓట్ల లెక్కింపు వంటి పనుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు
రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదు.

 

Tags: The Election Commission was shocked

Leave A Reply

Your email address will not be published.