Natyam ad

విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి

కడప ముచ్చట్లు:

విద్యుత్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలని నిరసన తెలుపుతూ  బిల్లు జీవో కాపీలను సిఐటియు, రైతు సంఘం నాయకు లు దహనం చేశారు కార్పొరేట్ల సంస్థలకు మేలు చేసేందుకే విద్యుత్ చట్ట సవరణ బిల్లును హడావుడిగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని సిఐటియు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మనోహర్,        బి.దస్తగిరి రెడ్డి తెలిపారు. బుధవారం కడప పాత బస్టాండ్ ఆవరణంలో విద్యుత్ చట్ట సవరణ బిల్లు జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ నెల 8 వ తేదీన   కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్  పార్లమెంటులో  విద్యుత్ చట్టాసవరణ బిల్లును ప్రతిపక్ష ఎంపీలు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా బిల్లును ప్రవేశ పెట్టారని వారు తెలిపారు. ఈ బిల్లును ఉద్యోగ కార్మిక ,రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకుండా మొండిగా వ్యవహారిస్తు న్నదని వారు దుయ్యబట్టారు. ఈ బిల్లు వల్ల దేశంలోని సామాన్య ప్రజలు రైతు లపై విపరీతమైన బారలు పడతాయి. ఎటువంటి సబ్సిడీలు ఉండవని, రద్దు అవుతా యి పలితంగా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ కూడా రద్దు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసులు రెడ్డి నాయకులు పాపిరెడ్డి చంద్రారెడ్డి ఓబులేష్ మాభాష  తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: The Electricity Amendment Bill should be repealed

Post Midle

Leave A Reply

Your email address will not be published.