కుప్పంలో ఏనుగుల బీభత్సం

The elephant's scream in the heap

The elephant's scream in the heap

Date:10/12/2019

కుప్పం ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా.. కుప్పం లో ఏనుగులు బీభత్సం సృష్టిస్థున్నాయి. ఏనుగుల దాడులతో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలోని పదిహేను గ్రామాల రైతాంగం జీవితం అస్తవ్యస్తమవుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఏనుగుల దాడుల్లో ధ్వంసమవుతుండడంతో ఏం చేయాలో అర్థంకాక, చేసిన అప్పులు తీర్చే దారి కానరాక తల్లడిల్లిపోతున్నారు. అటవీ శాఖాధికారులు ఈ దాడులను తేలికగా తీసుకుంటుండడంతో అన్నదాతల ఆవేదన తీరడంలేదు. ఏనుగులు నాశనం చేసిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెబుతున్నా ఆ మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. అసలు దాడులే జరగడం లేదన్న రీతిలో ఉన్నతాధికారులకు స్థానిక అటవీశాఖాధికారులు నివేదికలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నివేదికలు పరోక్షంగా రైతులమీద వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయి.

 

 

 

 

 

 

 

అటవీ ప్రాంతాల మీదుగానే ఏనుగుల గుంపు వెళ్లిపోతున్నదని ఆయా నివేదికల్లో పేర్కొంటుండడంతో రైతుల పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నా గుర్తించేవారే లేకుండా పోతున్నారు. ఫలితంగా నష్టపరిహారం అందడంలేదు. అంతేకాదు.. క్షణక్షణం ప్రాణభయంతో బతుకులిడ్వాల్సిన పరిస్థితులు నిత్యం ఎదురవుతుండడంతో కుటుంబాలకు కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం  లో ఎనుగుల బీభత్సం వల్ల.. దాదాపు 10 గ్రామాల ప్రజలు, రైతుల అనుక్షణం భయం భయం తో బతుకుతున్నారు. గుడుపల్లె మండలంలో ప్రతియేటా ఏనుగులొచ్చి మా బతుకులమీద పడిపోతా వుండాయి. ఒకసారి పంట పోతే పొయ్యిందిలే, ఇంగోసారి అయినా చేతి కొస్తాదనుకునేదాకి లేకండా పోయింది. అరిటితోటల మొదలు, రాగి పంటదాకా ఏనుగుల దాడుల్లో నాశనమై పోతావున్నాయిని రైతులు అంటున్నారు.  ఎవరొచ్చీ ఆదుకునే పరిస్తితి కనిపించడంలేదు. పొయిన ఏడాది మూడెకరాల అరటి, ఒకెకరా టమాటా తోటలను తొక్కి, తిని ఏనుగులు నాశనం చేసాయి.  నష్టపరిహారం ఇయ్యడానికి, ఎవురైనా అధికారి వస్తారని చూశాం ఎవ్వరు రాలేదని, తమను  ఆదుకున్న వారే లేరని అంటున్నారు.

 

జనతాదళ్ ఎస్ కు మాత్రం భవిష్యత్ కష్టాలు

 

Tags:The elephant’s scream in the heap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *