కార్మికుల సమస్యల కోసమే సీఐటియు ఆవిర్భావం

District President Gangaraju said the CITU has

Date:28/05/2019

పుంగనూరు ముచ్చట్లు:

కార్మికుల సమస్యల కోసమే సీఐటియు ఆవిర్భవించిందని జిల్లా అధ్యక్షుడు గంగరాజు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఇందిరాసర్కిల్‌లో ఆటో కార్మికులతో సమావేశం నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి యాబై సంవత్సరాలు గడుస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని మే 30న ఘనంగా నిర్వహించాలన్నారు. కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి, చరిత్ర సృష్టించిన సీఐటియుకు కార్మికుల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఎలాంటి సహాయం అందించకపోవడంతో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సమానపనికి సమాన వేతనం నినాదంతో పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళి, మస్తాన్‌, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పెద్దిరెడ్డి కుటుంబం వెంటే నడుస్తాం…

Tags; The emergence of CITU is for workers’ problems

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *