ఏపీలో ఇంజనీరింగ్ ఫీజు 35 వేలే

Date:12/07/2019

విజయవాడ ముచ్చట్లు:

ఇంజనీరింగ్‌ కాలేజీలకు కామన్‌ ఫీజు విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని 277 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు ట్యూషన్‌ ఫీజు ఒకే విధంగా ఉండేలా ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. 2019-20 విద్యా సంవత్సరానికి గానూ అన్నీ కాలేజీలకు రూ.35 వేల ఫీజునే రీయింబర్స్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గతేడాది వరకు తెలంగాణలో మాదిరిగానే ఒక్కో రకమైన కాలేజీకి ఒక్కో రకమైన ఫీజు విధానం ప్రభుత్వం అవలంభించింది.

 

 

 

ఈ క్రమంలో ఇంజనీరింగ్‌ కాలేజీ ఫీజుల ఖరారు విషయమై ఉన్నత స్థాయి అధికారులతో చర్చలు జరిపిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ మేరకు నివేధిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.అన్నీ కాలేజీలకు ఒకే ఫీజు విధానం వర్తించేలా.. సీఎం జగన్ సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును 15-16 తేదీల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

 

 

 

దీనికి చట్టబద్ధత రాగానే కమిషన్‌ కార్యాచరణ ప్రారంభిస్తుంది.ప్రస్తుతానికి రూ.35 వేల ఫీజును రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్టు మంత్రి సురేష్‌ వివరించారు. అయితే, ‘ఫెయిర్‌ ఫీజు’నే ఫైనల్‌గా అమలు చేస్తామని, రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే ఆ మొత్తాన్ని కూడా రీయింబర్స్‌ చేస్తామని మంత్రి సురేష్ అన్నారు. ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఈ విద్యా ఏడాదే ఇంజనీరింగ్‌కు ఫీజును నిర్ధారిస్తుందని తెలిపారు. ఫీజులు ఖరారు కాగానే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు.

 

రైల్వేల్లో ప్రైవేట్ సేవలు

 

Tags: The engineering fee for the AP is 35 Vale

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *