ఘటన దురదృష్టకరం

Date:09/05/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. శనివాకం అమర పరిశ్రమను సందర్శించారు.విశాఖ గ్యాస్ లీక్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సహించమని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కష్టకాలంలో బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించారని పేర్కొన్నారు.ఎల్జీ కంపెనీని 50 కోట్లు డిపాజిట్‌ చేయమని గ్రీన్ ‌ట్రిబ్యునల్‌ ఆదేశించిందని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 100 శాతం సురక్షితంగా మారాక గ్రామస్తులను అనుమతిస్తామని తెలిపారు. విశాఖ పోలీసులు, వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రి గౌతమ్‌రెడ్డి అభినందించారు.

ఎల్జీ కంపెనీ ముందు స్థానికుల ధర్నా

Tags: The event was unfortunate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *