Natyam ad

మాజీ మంత్రి గారికి తిప్పలు తప్పవా

నెల్లూరు ముచ్చట్లు:

అనిల్‌ కుమార్‌ యాదవ్‌. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. 2019 నుంచి మొన్నటి క్యేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ వరకు రాష్ట్ర మంత్రి. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అదే సెగ్మెంట్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టినా.. ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో రెండోసారి గెలిచాక కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి అనిల్‌కు.. మంత్రి అయ్యాక కనిపించిన అనిల్‌కు చాలా తేడా ఉందనేది నియోజకవర్గంలోని వైసీపీ నేతలు చెప్పేమాట. మంత్రిగా ఆయన తీరులో చాలా మార్పు వచ్చిందని చెబుతారు.మంత్రిగా ఉన్న మూడేళ్లూ నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్లను విస్మరించారనే ఆరోపణలు అనిల్‌పై ఉన్నాయి. సీఎం జగన్‌ మీద అభిమానంతో ఎన్నికల్లో అనిల్‌కు మద్దతిచ్చిన బలమైన సామాజికవర్గానికి చెందిన కొందరు ఆయనతో అంటీముట్టనట్టు ఉంటున్నారట. మినిస్టర్‌గా తన వర్గానికే అనిల్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపిస్తుంటారు. అనిల్‌ సమీప బంధువొకరు అన్ని వ్యవహారాల్లో తలదూర్చి భారీగా వెనకేసుకున్నట్టు వైసీపీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. దాదాపు 13 కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనాన్ని వాళ్లు ఉదాహరణగా చూపిస్తున్నారట. చెన్నై, బెంగళూరుల్లో ఖరీదైన ఆస్తులు పోగేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారట.

 

 

 

ఈ కారణంగానే మొదటి నుంచి అనిల్‌ కోసం పనిచేసిన పలువురు క్రమంగా దూరం జరుగుతున్నారట.అనిల్‌కు మొదటి నుంచి అనుచరుడిగా ఉన్న నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌.. ప్రస్తుతం మాజీ మంత్రి కార్యక్రమాల్లో కనిపించడం లేదు. కాకాణి గోవర్దన్‌రెడ్డి మంత్రి అయ్యాక అనిల్ అనుచరుల్లో చాలా మంది ప్లేట్ ఫిరాయించేశారు. పైగా నెల్లూరు సిటీలోని ప్రజల్లో అనిల్‌కు బలం తగ్గిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో ఆయన్ని వెంకటగిరి నుంచి బరిలో దింపాలని అనుకుంటున్నారట. ఆ విషయాన్ని అనిల్ చెవిలో కూడా వేశారట.వెంకటగిరిలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏం చేస్తారనేదానిపై సందిగ్ధత ఉంది. ఆయన కుమార్తె కైవల్య ఇటీవల టీడీపీ నేత లోకేష్‌తో సమావేశమై.. ఆత్మకూరు టికెట్ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆనం టీడీపీలోకి వెళ్తారని భావిస్తున్నారు. అందుకే వెంకటగిరిలో అనిల్‌ను బరిలో దింపే యోచన చేస్తున్నారట. అనిల్ బీసీ సామాజివర్గం కావడం.. వెంకటగిరిలో ఆ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం రాజకీయంగా కలిసి వస్తుందని లెక్క లేస్తున్నారట. పార్టీ సమావేశాల్లో తాను నెల్లూరు నుంచే పోటీ చేస్తానని అనిల్‌ చెబుతున్నా.. అనుచరులకు మాత్రం వెంకటగిరిలో పోటీపై సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గం మార్పు వల్లే నెల్లూరు సిటీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అనిల్‌ పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. వెంకటగిరిపై వైసీపీ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాక అక్కడ ఎక్కువగా ఫోకస్‌ పెడతారని భావిస్తున్నారు. మరి.. మాజీ మంత్రి అనిల్ మనసులో ఏముందో.. పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో కాలమే చెప్పాలి.

 

Post Midle

Tags: The ex-minister is wrong

Post Midle

Leave A Reply

Your email address will not be published.