కార్పొరేట్, పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి
పిడి యస్ యు జిల్లా అధ్యక్షులు రఫీ డిమాండ్
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు యస్ యమ్ డి .రఫీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య ,నారాయణ, భాష్యం మరియు ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థి తల్లిదండ్రులు నుంచి అనేక రకాల పేర్లతో అక్రమ వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. అడ్మిషన్ ఫీజు, స్పెషల్ పూజలు పుస్తకాలు రూపంలో ఫీజులు, పేర్లతో తల్లిదండ్రుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారని వారు తెలిపారు.తక్షణమే నంద్యాల జిల్లా లో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలను జిల్లా విద్యశాఖ అధికారి తనిఖీలు నిర్వహించాలని వారు తెలిపారు లేనిపక్షంలో పీడీ ఎస్ యూ ఆధ్వర్యంలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల ఎదురుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతము అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పట్టణ కార్యదర్శి నవీన్ పిడిఎస్యు పట్టణ నాయకులు డి .మస్తాన్,అజీస్,అఖిల్,రవి,నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Tags: The exploitation of corporate and school fees must be stopped