వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

The exquisite Balchampetta Ellamma Kalyanam

The exquisite Balchampetta Ellamma Kalyanam

Date:17/07/2018
హైదారాబాదు ముచ్చట్లు
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం మంగళవారం కనుల పండువగా సాగింది. మంత్రి తలసాని దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మ‌వారి క‌ల్యాణ మ‌హోత్స‌వానికి  సీయం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి అల్లోల విజ‌య ల‌క్ష్మి, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో  వారికి స్వాగతం పలికారు. అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు అశేషంగా వచ్చిన భక్తులతో ఆలయం ప్రాంతం జనసంద్రంగా మారింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ  అన్ని ఏర్పాట్ల‌ను చేసింది.
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం https://www.telugumuchatlu.com/the-exquisite-balchampetta-ellamma-kalyanam/
Tags:The exquisite Balchampetta Ellamma Kalyanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *