జిల్లాలో పడగ విప్పిన ప్యాక్షన్

ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల దారుణ హత్య

నంద్యాల ముచ్చట్లు:

పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం లో గల గడివేముల మండలం పెసరవాయిలో గురువారం ఉదయం ప్రత్యర్థుల దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు  దారుణ హత్యకు గురయ్యారు. పెసరవాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వరరెడ్డి. 54 సంవత్సరాలు. సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాపరెడ్డి 52 సంవత్సరాలు ఇరువురుని దారుణంగా నరికి చంపారు. ప్రతాపరెడ్డి సమీప బంధువు ఇటీవల  చనిపోగా మూడు రోజుల కార్యక్రమం కోసం శ్వశానవాటికకు వెళుతుండగా ప్రత్యర్థులు బొలెరో వాహనంతో గుద్దారు కింద పడిపోయిన తర్వాత కత్తులతో నరికి చంపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వడ్డు వెంకటేశ్వర్ రెడ్డి 52 సంవత్సరాలు. వడ్డు సుబ్బారెడ్డి 70 సంవత్సరాలు. వెంకటేశ్వర రెడ్డి. 35 సంవత్సరాలు. వీరిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ముగ్గురు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. వైకాపా వారే ఈ హత్యలు చేయించారు అని చనిపోయిన వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దారుణానికి కారణమైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పలువురు తెలుగుదేశం నాయకులు ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:The faction in the district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *