Natyam ad

ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం విజయవంతం చేయాలి

రామసముద్రం ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ఆశయంతో పేదల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైస్ ఎంపీపీ రమణారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని కుదురుచీమనపల్లి లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో గ్రామాలలో వైద్యాధికారి, ఎం ఎల్ హెచ్ పీ, ఏ ఎన్ ఎం, ఆశా, ఆరోగ్య సంచార సిబ్బంది ఉదయం 9గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ అందుబాటులో ఉంటారన్నారు. ఉదయం ఒ. పి సేవలు, మద్యాహ్నం అంగన్వాడి కేంద్రాల్లోను, పాఠశాలలో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులైన కదల లేని ఆరోగ్యశ్రీ లబ్దిదారులను పరామర్శించి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారికి సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ రుగ్మతలకు వైద్యం, గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు, కౌమార దశలోని బాల బాలికలకు వృద్ధులకు, దీర్ఘకాలిక సమస్యలైన అధిక రక్తపోటు, మధుమేహం, క్షయ మొదలైన వ్యాధులతో పాటు పౌష్టికాహార, మానసిక ఆరోగ్య సేవలు, పొగాకు, మద్యం నివారణకు కౌన్సెలింగ్ సేవలు కూడా అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో 67 రకాల మందులు, 14 రకాల డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక నిపుణు లైన టెలీ మెడిసిన్ సేవలతో పాటు అవసరమైన రోగులకు రిఫరల్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కుటుంబ వైద్యుల అందరి మొబైల్ ఫోన్ నెంబర్లు YSR విలేజ్ క్లినిక్ లో ప్రదర్శించబడుతాయన్నారు. నిర్దేశించిన రోజుల్లో గ్రామంలో గల ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించబడతాయన్నారు. మండలంలోనే ఈ కార్యక్రమాన్ని తొలి విడతగా కుదురుచీమనపల్లి లో ప్రారంభించారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ భాస్కర్ గౌడు, సింగిల్ విండో చెర్మెన్ కేశవరెడ్డి, మాజీ చెర్మెన్ కృష్ణారెడ్డి, ANm సుగుణమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: The family doctor program should be successful

Post Midle