స్వతంత్ర సమరయోధుల కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం

పట్టభద్రుల సంఘం అధ్యక్షులు విశాల్

సంగారెడ్డి  ముచ్చట్లు:

సంగారెడ్డి జిల్లా,సదాశివపేట పట్టణానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మాణెమ్మ కుటుంబానికి పది ఎకరాల పట్టా భూమి సర్టిఫికెట్లు ఇప్పించి న్యాయం చేకూర్చటంలో సదాశివపేట పట్టభద్రుల సంఘం ఎప్పుడూ ముందుంటుందని  అధ్యక్షుడు విశాల్ తెలిపారు. నేడిక్కడ మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఒక స్వాతంత్య్ర సమరయోధునికి న్యాయం చేయలేని అధికార టీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నిస్తూ  ఆవేదనను వ్యక్తం చేశారు.అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు   శరవేగంగా  కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి వర్యులు హరీష్ రావు ఆదేశాల మేరకు స్వాతంత్య్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ కుటుంబానికి పది ఎకరాల భూమి కబ్జాను ఇప్పించి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయంలో  వెనుకడుగు వేయకుండా స్వతంత్ర సమరయోధుడు కుటుంబానికి న్యాయం చేకూరే వరకు పోరాడుతామని ధర్నాలు నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ యొక్క  సమావేశంలో స్వాతంత్య్ర సమరయోధునికి అండగా   పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

Tags: The family of the freedom fighters will fight until justice is done

Leave A Reply

Your email address will not be published.