చిన్నారిని చితకబాది హతమార్చిన తండ్రి

Date:05/12/2020

నిర్మల్  ముచ్చట్లు:

నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం అనంతపేట గ్రామం నందు భార్యభర్తల గొడవ కారణంగా అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని తండ్రి విచక్షణారహితంగా చితక బాదడంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది.  పాపను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.
నిర్మల్ మండలం అనంతపేట గ్రామానికి చెందిన దినేష్ అనే ముప్పై సంవత్సరాల యువకుడు పని పాట లేకుండా బలాదూరుగా తిరుగుతుంటాడు.  అతనికి నాలుగేళ్ల నిత్య అనే కూతురు ఉంది. శుక్రవారం  రాత్రి పది గంటల ప్రాంతంలో తప్ప తాగి వచ్చి భార్యతో గొడవపడి కూతురు నిత్యను విచక్షణ రహితంగా చితకబాదడంతో అపస్మారక స్థితికి చేరుకుంది, వెంటనే చిన్నారి నిత్యను హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.  దీంతో చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకుని వచ్చారు. చిన్నారి మృతికి కారణమైన తండ్రి వినేశ్ పరారీలో ఉన్నాడు.
విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు అడిగి తెలుసుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.  మృతురాలు నిత్య తల్లి మాట్లాడుతూ పనీపాటా లేకుండా బలాదూరుగా తిరుగుతుంటాడని, ఏం పని చేయండని, గతంలో చాలాసార్లు కన్న కూతురు అని తెలియకుండా విచక్షణారహితంగా కొట్టాడని, ఈ రోజు సైతం కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుందని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని వాపోయింది .        నిర్మల్ గ్రామీణ ఎస్సై మిథున్ మాట్లాడుతూ తాగిన మైకంలో కన్నకూతుర్ని విచక్షణారహితంగా చితక బాదడంతో అపస్మారక స్థితికి చేరుకుందని, హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు  .

కరోనాతో మారిన లైఫ్ స్టైల్

Tags: The father who crushed and killed the child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *