కొడుకును చెరపవద్దన్న తండ్రి దారుణ హత్య-మృతుడు వైఎస్సార్సీపీ నాయకుడు
-హతుడు గిరినాయుడు
– పట్ట పగలే దారుణం
-గ్రామంలో విషాధం
చౌడేపల్లె ముచ్చట్లు:

తన కొడుకు తోపాటు గ్రామంలోని యువకులను చెడు అలవాట్లకు భానీస చెయొద్దని చెప్పేందుకు వెళ్లిన తండ్రిని అందరూ చూస్తుండగానే పట్టపగలు అతి కిరాతకంగా కత్తితో నరికి చంపిన హ్యేయమైన సంఘటన చౌడేపల్లె మండలం గడ్డంవారిపల్లి పంచాయతీ పెద్దకంపల్లెలోశనివారం సాయంత్రం చోటుచేసుకొంది. పుంగనూరు రూరల్ సీఐ మదుసూధనరెడ్డి కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. మండలంలోని పెద్దకంపల్లె ఎస్సీ కాలనీలో నివాసమున్న మండలంలోని వైఎస్సార్సీపీ దళిత నాయకుడు పల్లం శ్రీనివాసులు(45) భార్య తులసమ్మ,కుమారులు ఢిల్లీబాబు(19), భానుప్రకాష్(18) లు ఉన్నారు. ఇలా ఉండగా పె ద్దకంపల్లెకు చెందిన కె. గిరినాయుడు తిరుపతిలో నివాసముంటూ స్వగ్రామానికి తరచూ వచ్చి వెళ్తుంటాడు. ఈ సమయంలో గత నాలుగు రోజులుగా గిరి నాయుడు శ్రీనివాసుల పెద్దకుమారుడు ఢిల్లీబాబుతోపాటు మరికొందరు యువకులను చెడుఅలవాట్లకు బానీస చేస్తుండడంతో విషయం తెలుసుకొన్న శ్రీనివాసులు శనివారం సాయంత్రం సుమారు మూడన్నర గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై తన ఇంటినుంచి పెద్దకంపల్లె లో గిరినాయుడు ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడే ఉన్న గిరినాయుడుతో నాకుమారుడి భవిష్యత్తును ఎందుకిలా నాశనం చేస్తున్నావని అగడంతో రెచ్చి పోయిన గిరినాయుడు ఇంట్లో ఉన్న కత్తితో ఒక్కసారిగా శ్రీనివాసులను నరికాడు.ఈ సమయంలో ఎడమ చేతిపైన, తలపైన, గొంతుపైన తీవ్రమైన దెబ్బలు తగడలడంతో శ్రీనివాసులు రక్తపు మడుగులో అక్కడిక్కక్కడే దుర్మణం చెందాడు. వెంటనే గిరినాయుడు అతని అనుచరులు అక్కడినుంచి పరారైయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకొన్నాయి. సంఘటనా స్థలానికి సీఐ ,తోపాటు ఎస్ఐ రవికుమార్ , పోలీసులు చేరుకొని ధర్యాప్తు చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం తరలించారు. కేసు నమోదుచేసి గిరినాయుడు ను ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా హత్య జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారు. హత్య కు గల కారణాలు మరేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. పోలీసుల ధర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంఘటనా స్థలంలో వివరములు తెలుసుకొంటున్న సీఐ మ్యధుసూధనరెడ్డి
మృతిచెందిన పల్లం శ్రీనివాసులు
హంతకుడు గిరినాయుడు ఫైల్పోటో
Tags: The father who did not want to imprison his son was the leader of the brutally murdered-dead YSSRCP
